మద్యం దుకాణాలకు పర్మిట్ రూమ్ల అనుమతిని తొలగిస్తారనే పుకార్లను ఎవరూ నమ్మరాదని ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ సూపరిండెంట్ సి.హెచ్ విజయ్ పేర్కొన్నారు. జగిత్యాలలోని ఎక్సైజ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గతంలో మాదిరిగానే ప్రతి మద్యం దుకాణానికి పర్మిట్ రూమ్ వెసులుబాటు ఉంటుందన్నారు. ఈ నెల 16 వరకు మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులను స్వీకరించి 18న లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2216 మద్యం దుకాణాలకు గాను 4100 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: ఆర్టికల్ 370పై విపక్షాలకు మోదీ సవాల్