ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక కార్యాలయంలో పాలకవర్గంతోపాటు నాయకులు, పలువురు ప్రముఖులతో పట్టణ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.
రోడ్డు విస్తరణ పనులు, నూతన మురుగు కాలువల నిర్మాణం, సీసీ రోడ్లు, మిషన్ భగీరథ పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఫోన్ చేసి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. పట్టణ పారిశుద్ధ్యంపై అధికారులు, కార్మికులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పరిశుభ్రతను ప్రజలకు నిత్యం అందిస్తూ.. వారికి సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చాలని సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. పురపాలక సిబ్బంది ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పురపాలక కమిషనర్ జగదీశ్వర్ గౌడ్‌ను ఆదేశించారు.
ఇదీ చూడండి: ఆందోళనల నడుమ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు