పట్టణాల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా నియోజకవర్గంలోని మెట్పల్లి పురపాలక పరిధిలో కోటీ యాభై లక్షల రూపాయల నిధులతో ప్రారంభిస్తున్న బైపాస్ రోడ్డుకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. పట్టణంలోని రామ్‌నగర్, ఆదర్శ్ నగర్ మీదుగా పోలీస్ స్టేషన్ పక్కనుంచి జాతీయ రహదారి వరకు బీటీ బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అనంతరం కాలనీవాసులు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: రామోజీ ఫిల్మ్‌సిటీకి మెట్రో ఫీడర్ బస్సు సర్వీసులు