ETV Bharat / state

జీవితమంతా అక్కడే.. చివరి చూపు కోసం కుటుంబసభ్యులు - సౌదీలో ఎకీన్​పూర్​ వాసి మృతి

సొంతూళ్లో ఉపాధి లేక సౌదీకి వెళ్లాడు. పని కోసం మతం, పేరు మార్చుకున్నాడు. కుటుంబం కోసం 40 ఏళ్లు ఎడారి జీవితం గడిపి... 70 ఏళ్ల వయస్సులో అక్కడే మృతి చెందాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మృతదేహం ఇక్కడికి తీసుకురావడం కష్టంగా మారింది. ఎలాగైనా రప్పించాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.

jagitial district ekeenpur person bhairi rajamallaiah died in saudi arabia
జీవితమంతా అక్కడే.. చివరి చూపు కోసం కుటుంబసభ్యులు
author img

By

Published : Sep 24, 2020, 10:27 AM IST

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఎకీన్​పూర్​కు చెందిన బైరి రాజమల్లయ్య... ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. పని కోసం ఇస్లాం మతం స్వీకరించి... అబ్దుల్ రహమాన్​​గా మారాడు. అయినప్పటికీ రెండు మతాలను గౌరవించేవాడు. కుటుంబం కోసం 40 ఏళ్లుగా అక్కడే ఉండి కూలీ పనులు చేసేవాడు. ఇప్పుడు 70 ఏళ్ల వయస్సులో... జిద్దాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కుటుంబం కోసం తన జీవితమంతా అక్కడే గడిపి ప్రాణాలు విడిచాడు రాజమల్లయ్య అలయాస్ అబ్దుల్​ రహమాన్​. ఇప్పుడున్న పరిస్థితుల్లో మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావడం కష్టతరంగా మారింది. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ రవిని కుటుంబసభ్యులు వేడుకున్నారు.

ఇదీ చూడండి: రాజధానిలో కరోనా కేసుల తగ్గుముఖం... నగరవాసుల్లో ఆనందం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.