జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జగన్నాథుని రథయాత్రను వైభవంగా నిర్వహించారు. ఈ రథయాత్రకు భారీగా భక్తులు తరలివచ్చి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి రథాన్ని తాడుతో ముందుకు లాగారు.
రోడ్డును ఎమ్మెల్యే శుభ్రం చేస్తూ భక్తి భావాన్ని చాటారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి రథాన్ని తాడుతో లాగుతూ హరే రామ హరే కృష్ణ భజనలు చేశారు.
ఇవీ చూడండి: అరసవల్లి సూర్యదేవాలయం.. స్వామివారి నిజరూప దర్శనం