జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. జగిత్యాల కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుదర్శన్, జస్టిస్ వెంకటేశ్వర్, ఎస్పీ సింధుశర్మ, కలెక్టర్ రవి ఆమె వెంట ఉన్నారు. అంతకుముందు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి: వేములవాడ రాజన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి