జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామి జయంతి ఉత్సవాలపై సూర్యుడి ప్రభావం పడింది. ఉష్ణోగ్రతలు 47డిగ్రీలు దాటుతుండటం వల్ల ఎండ వేడిమికి తట్టుకోలేక భక్తుల రాక తగ్గింది. గత ఉత్సవాలను పోల్చి చూస్తే ఈ సారి భక్తుల సంఖ్య భారీగా అంతకంతకు తగ్గిపోయింది. ఉత్సవాల సమయంలో అంజన్న మాలధారులు 3లక్షలకు పైగా హాజరై దీక్షా విరమణ చేసే వారు. కాని ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. బుధవారం హనుమాన్ జయంతి కాబట్టి ఈ రోజు రాత్రికి భక్తుల సంఖ్య పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇవీ చూడండి: రోహిణి కార్తీ ప్రవేశంతో పెరిగిన ఉష్ణోగ్రతలు