జగిత్యాల జిల్లా కోరుట్లలో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా పట్టణంలో పోలీసులు కట్టిదిట్టమైన భద్రతను అమలు చేశారు. కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో ఒకరికి.. భీముని దుబ్బలో మరొకరికి వైరస్ సోకగా.. ఈ రెండు ప్రాంతాల్లో ప్రజలు ఎక్కడికీ వెళ్లకుండా పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు.
భీమునిదుబ్బలో అన్ని వీధులకు బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు ఎవరు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారులు ఇంటింటికి తిరుగుతూ శుభ్రత పాటించాలంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు నిషేధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి: కోయలేక.. కోసినా అమ్మలేక.. చ'మిర్చి'న రైతు కళ్లు!