జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని రంగాపేటలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షంతో చెట్ల కొమ్మలు విరిగి పడగా.. పలు ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. వీటితోపాటు కల్లాల్లో ఉన్న ధాన్యం రైతుల కళ్లముందే తడిచి ముద్దైంది. నీటి ప్రవాహానికి ధాన్యం కొట్టుకుపోయి.. రైతులకు నష్టం వాటిల్లింది. గత నెల రోజులుగా కొనుగోళ్లు చేపట్టడం లేదంటూ.. రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'కుటుంబ ఆత్మహత్య అనుమానాస్పద మృతిగా ప్రాథమిక నిర్ధరణ'