జగిత్యాల పట్టణంలోని కండ్లపల్లి చెరువు పైభాగాన ఎఫ్‌టీఎల్ లెవల్లో మట్టి నింపుతూ ఆక్రమణకు పాల్పడుతున్నారని గంగపుత్రులు ఆందోళనకు దిగారు. ఆక్రమణను నిరసిస్తూ పట్టణంలోని నిజామాబాద్ రహదారిపై ధర్నా చేపట్టారు.
ధర్నాతో రోడ్డుపై గంటపాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఆక్రమణ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గంగపుత్రులు డిమాండు చేశారు. కబ్జా జరగకుండా చూస్తామని అధికారులు హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి: 'కనీసం పెట్టుబడి రావడం లేదు.. ప్రభుత్వం ఆదుకోవాలి'