జగిత్యాలకు చెందిన ఐదేళ్ల బాలుడు శస్త్రచికిత్స కోసం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు వెళ్లి లాక్డౌన్ వల్ల అక్కడే చిక్కుకుపోయాడు. ఈ నెల 14న అంబులెన్స్‌లో అతను జగిత్యాలకు రాగా కరోనా పాజిటివ్‌గా తేలడం వల్ల 15వ తేదీన హైదరాబాద్ తరలించారు.
పూర్తిగా కోలుకున్న బాలుడిని 108 వాహనంలో బుధవారం రాత్రి స్వగ్రామానికి చేర్చారు. జిల్లాలో పాజిటివ్ వచ్చిన ముగ్గురు కోలుకోగా కొత్త కేసులు నమోదు కాలేదని జిల్లా కలెక్టర్ గుగులోతు రవి చెప్పారు.