ఓ వైపు వర్షాలు కురుస్తున్నా యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకపోవడంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాననీటిలో ధాన్యం తడిసి ముద్దవుతున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి రహదారి లక్ష్మీపూర్ నల్లగుట్ట వద్ద రైతులు ధర్నాకు దిగారు. ట్రాక్టర్లు, వాహనాలు రోడ్డుపై పెట్టి రాకపోకలు నిలిపివేశారు.
ధాన్యం కొనుగోళ్లలోనూ బస్తాకు అదనంగా 5 నుంచి 6 కిలోలు తూకం వేసి రైతులను నిలువునా ముంచుతున్నారని వాపోయారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు వచ్చి హామీ ఇవ్వడం వల్ల రైతులు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: Love Maniac : ప్రేమించలేదని నర్సు గొంతుకోసిన ఉన్మాది