జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లు నిండి వెలుపల వరకు భక్తులు బారులు తీరారు.
స్వామి దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావటంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే భక్తులను ఆలయంలోనికి అనుమతిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: త్వరలోనే 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: కేటీఆర్