దీపావళి సందర్భంగా ఆదివాసీలు నిర్వహించుకునే దండారి వేడుకలు జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం మంగెళ గోండుగూడెంలో ఘనంగా జరిగాయి. ఆదివాసీలు సంప్రదాయ బద్ధంగా గుస్సాడీ నృత్యాలు చేశారు. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలోని గూడెంల నుంచి తరలి వచ్చిన ఆదివాసీలతో గోండుగూడెం సందడిగా మారింది. దీపావళి రోజు వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నారు.. రోజుకో గ్రామంలో ఈ వేడుకలు జరుగనున్నాయి.
ఇవీ చూడండి: "భక్తుల కొంగు బంగారం... భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనం"