ETV Bharat / state

ముంబయి నుంచి వచ్చిన మరో ముగ్గురికి కరోనా

author img

By

Published : May 15, 2020, 5:53 PM IST

జగిత్యాల జిల్లాలో ముంబై నుంచి వచ్చిన మరో ముగ్గురు వలస కూలీలకు కరోనా వైరస్​ సోకింది. వైరస్​ సోకిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించనున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారు పుప్పాల శ్రీధర్​ తెలిపారు.

corona-case-update-in-jagityal-district
ముంబయి నుంచి వచ్చిన మరో ముగ్గురికి కరోనా

జగిత్యాల జిల్లాలో ముంబయి నుంచి వచ్చిన మరో ముగ్గురికి కరోనా వైరస్​ సోకినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి పుప్పాల శ్రీధర్​ తెలిపారు. జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి 2,784 మంది వలస కార్మికులు రాగా వారందరినీ హోం క్వారంటైన్​లో ఉంచారు. కరోనా లక్షణాలున్నవారిని పరీక్షించగా.. ఇవాళ ఒక్క రోజే మూడు పాజిటివ్​ కేసులు వచ్చాయి.

వైరస్​ సోకిన ముగ్గురిని గాంధీ ఆసుపత్రికి తరలించనున్నట్లు శ్రీధర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్​లోనే ఉండేలా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఈ మూడు కేసులతో కలిపి మొత్తం 9 కేసులు నమోదు కాగా ముగ్గురు కోలుకున్నారు. ప్రస్థుతం 6 యాక్టివ్​ కేసులున్నట్లు కలెక్టర్ గుగులోతు రవి వెల్లడించారు.

ఇదీ చదవండి:కరోనా మృతుల పక్కనే సాధారణ రోగులకు చికిత్స!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.