రైతుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీ నర్సింగరావు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
ఆదుకోవాలి..
వరి కొనుగోలు కేంద్రాలు తొలగించొద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సన్నరకం ధాన్యం కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని సూచిచారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించాలని ఆందోళన నిర్వహించారు.
ఆకట్టుకుంది..
మెట్‌పల్లి పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై నాయకులు బైఠాయించారు. గంట పాటు ఆందోళన చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్నదాతల ఆవేదనను తెలుపుతూ ఓ రైతు పాడిన పాట అందర్నీ ఆకట్టుకుంది.
ఇదీ చూడండి: 'ఐటీఐఆర్ ప్రాజెక్టు ఆలస్యానికి కారణం వారి నిర్లక్ష్యమే'