గాల్వన్ లోయలో భారత్ - చైనా సైనికుల ఘర్షణల్లో మరణించిన కర్నల్ సంతోష్ బాబుకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కేంద్రమైన జగిత్యాలలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మౌనం పాటించారు. ర్యాలీలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆయన మృతి భారతదేశానికే గర్వకారణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. సంతోష్ బాబు సతీమణికి గ్రూపు-1 ఉద్యోగం, నివాస స్థలం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌ను జీవన్‌రెడ్డి కోరారు.
ఇదీ చూడండి:చైనాతో వివాదంపై నేడు ప్రధాని అఖిలపక్ష భేటీ