ETV Bharat / state

డ్రై రన్​ను పరిశీలించిన కలెక్టర్‌

author img

By

Published : Jan 8, 2021, 9:43 PM IST

జిల్లా ఆస్పత్రిలో డ్రై రన్‌ నిర్వహణను కలెక్టర్‌ పరిశీలించారు. టీకా వేసిన తర్వాత 30 నిమిషాల పాటు పర్యవేక్షించేందుకు అదనపు పడకలను, వైద్యులను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే టీకాను వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు.

collector-who-examined-the-dry-run-in-jagityal
డ్రై రన్​ను పరిశీలించిన కలెక్టర్‌

కరోనా వైరస్‌ కోసం అందుబాటులోకి వచ్చిన టీకా డ్రై రన్‌ జగిత్యాల జిల్లా ఆస్పత్రిలో నిర్వహించారు. ముందుగా 25 మంది వైద్య సిబ్బందికి డ్రై రన్‌ పరిక్షించారు. దీనిని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ రవి, ఆర్డీవో మాధురి దగ్గరుండి పరిశీలించి వైద్యులతో మాట్లాడారు.

జగిత్యాల జిల్లా ఆస్పత్రితోపాటు, మెట్‌పల్లిలోనూ డ్రై రన్‌ జరిగిందని కలెక్టర్ తెలిపారు. టీకా వేసిన తర్వాత 30 నిమిషాల పాటు పర్యవేక్షించేందుకు అదనపు పడకలను, వైద్యులను అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే టీకాను వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: క్లూ ఇచ్చిన కాగితం... ఆ మహిళదే మృతదేహం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.