చిట్టీల పేరుతో హమాలి కూలీలను నిలువునా మోసం చేశాడు ఓ వ్యక్తి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సంతోష్ అనే వ్యక్తి కొన్ని రోజులు హమాలిగా పనిచేశాడు. యార్డులోని కూలీలతో పరిచయం పెంచుకున్నాడు. చిట్టీల వ్యాపారం మొదలుపెట్టిన సంతోష్... కూలీలందరితో డబ్బులు కట్టించుకున్నాడు. చిట్టీ గడువు ముగిశాక తమ డబ్బులు ఇవ్వమంటే ముఖం చాటేశాడు.
గడువు ముగిసినా ఇవ్వడంలేదని ఆరోపిస్తూ 16 మంది కూలీలు పొలీస్స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. పలువురు చిరు వ్యాపారులు కూడా.... తమను మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.12 లక్షలు తీసుకొని మోసం చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.