జగిత్యాల జిల్లా మల్యాల మండలం మ్యాడంపల్లిలో చిరుత సంచారం గ్రామస్థులను భయాందోళనకు గురిచేసింది. మ్యాడంపల్లికి చెందిన బాసవేని అంజయ్య గ్రామశివారులోని మామిడితోటలో గేదెను మేపుతుండగా చిరుత కన్పించినట్లు తెలిపాడు. మామిడి చెట్టుపైకి ఎక్కి దృశ్యాలను చిత్రీకరించాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. చిరుత సంచారం గురించి అటవీ అధికారులు ఇంకా ధృవీకరించలేదు. శరీరంపై చారలు కనిపించకపోవడం వల్ల తోడేలేమోనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జంతువు ఆనవాళ్ల కోసం పరిశీలిస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి నరసింహరావు తెలిపారు.
చిరుత కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు - chirutha_kalakalam_at_jagityala
మ్యాడంపల్లిలో చిరుత కలకలం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. మూడు రోజుల క్రితం ముత్యంపేటలో గేదెను గాయపరిచినట్లు గ్రామస్థులు వెల్లడించారు.