ETV Bharat / state

వ్యవ'సాయం'లో నిమగ్నమైన పిల్లలు - జగిత్యాల జిల్లా తాజా వార్తలు

బడిలో పాఠాలతో పాటు ఇంటిలో బాధ్యత తెలిసినప్పుడే పిల్లలకు సక్రమమైన నడవడిక అలవడుతుందని పెద్దలు అంటారు. బడిలో పిల్లల్ని ఏరా మీ అమ్మానాన్నా ఏమి చేస్తారంటే వ్యవసాయం చేస్తారు... మరి నువ్వెప్పుడైనా పొలం వెళ్లావా అంటే.. లేదు... ఇలాంటి సమాధానాలే ఎక్కువ వినిపిస్తాయి. లాక్​డౌన్​ ప్రభావం వల్ల ఇళ్లకే పరిమితమైన పిల్లలు తల్లిదండ్రులతో కలిసి పొలం పనుల్లో పాల్గొంటూ వ్యవ'సాయం' చేస్తున్నారు.

students help to parents in forming
వ్యవ'సాయం'లో నిమగ్నమైన పిల్లలు
author img

By

Published : Apr 24, 2020, 3:56 PM IST

పిల్లలను బడికి పంపడానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో వారికి తెలిస్తే వారి భవిష్యత్తు నిర్మించుకోడానికి ఆ పరిస్థితులు ఎంతో దోహదపడతాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం సత్తెక్కపల్లి కూరగాయల సాగుకు పెట్టింది పేరు. గ్రామస్థులంతా తెల్లారి లేస్తే పొలంబాటే పడతారు. లాక్​డౌన్​ కారణంగా విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడం వల్ల పిల్లలు కూడా సాగులో సాయం చేస్తూ తమ తల్లిదండ్రుల కష్టాన్ని పంచుకుంటున్నారు.

ఇంచుమించు గ్రామంలోని పిల్లలంతా తెల్లారి మొదలు సాయంత్రం వరకు సాగులోనే నిమగ్నమవుతున్నారు. కూరగాయలు కోస్తూనో... కలుపు ఏరివేస్తూనో కుటుంబ సభ్యులంతా కలిసి చేసుకుంటూ ఆడుతు పాడుతూ పనులు చేసుకుంటున్నారు. గతంలో తమ పాఠశాలలో జరిగిన సంఘటనలు... తమ స్నేహితుల గురించి.. పాఠాల సంగతులు తల్లిదండ్రులకు చెపుతూ ఆనందంగా గడుపుతున్నారు.

తల్లిదండ్రులకు సాయం చేస్తూనే... వ్యవసాయంలో మెలకువలు నేర్చుకుంటున్నారు పిల్లలు. ఇంట్లో వారంతా కలిసి పనిచేయడం వల్ల కూలీల అవసరం కూడా ఉండడం లేదు. బాధ్యతగా పిల్లలు కూడా తమతో పాటు వస్తుండడం తల్లిదండ్రులకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి: సీఎంఆర్​ఎఫ్​కు పెళ్లి ఖర్చులు..వరుడికి కేటీఆర్ ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.