ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలని.. జగిత్యాలలో భాజపా ధర్నా

పేదప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి.. ఖజానా నింపుకోవడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఎల్​ఆర్​ఎస్​ తీసుకువచ్చిందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజవర్గంలోని మెట్​పల్లి, మల్లాపూర్​ మండల కేంద్రాల్లో తహశీల్దార్​ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించారు.

author img

By

Published : Sep 29, 2020, 4:32 PM IST

BJP Protest In Korutla Against LRS
ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలని.. జగిత్యాలలో భాజపా ధర్నా

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్​పల్లి, మల్లాపూర్​ మండల కేంద్రాల్లోని తహశీల్దార్​ కార్యాలయాల ముందు భాజపా నేతలు ధర్నా నిర్వహించారు. పేద ప్రజలకు భారంగా మారనున్న ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రభుత్వ ఖజానాను నింపుకొనేందుకే ఎల్​ఆర్​ఎస్​ అంటూ కుయుక్తులు పన్నుతుందని భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం తహశీల్దార్లకు వినతి పత్రం సమర్పించారు.

ఇదీ చూడండి: రామప్ప దర్శనానికి 'భగీరథ' యత్నం చేయాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.