ప్లాస్టిక్‌ని వాడకుండా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచిస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో లయన్స్ క్లబ్ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాలను నిర్వహించింది. పట్టణంలోని కూరగాయల మార్కెట్లో ప్రజలకు, కూరగాయలు విక్రయించే రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం వారు ప్రత్యేకంగా తయారు చేయించిన జ్యూట్ బ్యాగులను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. సుమారు వెయ్యి బ్యాగుల వరకు అందించారు. ప్లాస్టిక్‌ని నిర్మూలించి పర్యావరణాన్ని కాపాడుకుందామని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఇవీచూడండి: ప్రభుత్వ అధికారిపై భాజపా నేత కుమారుడి వీరంగం