ETV Bharat / state

Cows milk: దేశవాళి గోవుకు మంచి రోజులు రాబోతున్నాయా? - పశువైద్య విశ్వవిద్యాలయం

దేశవాళి గోవుకు త్వరలోనే మంచి రోజులు రానున్నాయి. పాడి ఆవులు, పాల అభివృద్ధికి చర్యలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గోవుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే జగిత్యాల జిల్లా కోరుట్లలోని పశువైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు మొదటిసారిగా పిండ మార్పిడి పద్ధతి ద్వారా దీనికి శ్రీకారం చుట్టారు.

IVF method for the development of cows
గోవుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
author img

By

Published : Oct 11, 2021, 8:15 AM IST

దేశంలో అంతరించిపోయే దశకు చేరిన దేశవాళి ఆవుల అభివృద్ధికి చర్యలు మొదలయ్యాయి. జగిత్యాల జిల్లా కోరుట్లలోని పశువైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు మొదటిసారిగా పిండ మార్పిడి పద్ధతి ద్వారా దీనికి శ్రీకారం చుట్టారు. 1925లో దేశవాళి ఆవులైన సాహివాల్‌, గిర్‌, ధార్‌ పార్కల్‌ వంటి ఆవుల పాల ఉత్పత్తి ఒక ఈత కాలంలో (300 రోజులు) సుమారు 2,500-3,000 లీటర్లు ఉండేది. స్వాతంత్య్రం తర్వాత దేశంలో విదేశీ ఆంబోతుల వీర్యాన్ని కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా దేశీయ ఆవులపై ప్రయోగించి సంకరజాతి ఆవుల ద్వారా పాల ఉత్పత్తిని పెంచారు. అవి ఎక్కువ పాలిచ్చినా రోగాలకు గురయ్యేవి. ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోయేవి. పోషణకు ఎక్కువ ఖర్చయ్యేది. క్రమంగా దేశవాళి ఆవులు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది. దీని నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ పథకం ద్వారా ప్రత్యేక చర్యలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 30 యూనిట్లను మంజూరు చేసింది. అందులోభాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పశువైద్య కళాశాలకు 2019లో పిండ మార్పిడి పద్ధతి (ఐవీఎఫ్‌ - ఇన్‌ విట్రో ఫర్టిలైజేషన్‌) సెంటర్‌ కేటాయించారు. అధిక పాల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన దేశీయ ఆవుల నుంచి ఆండాలను సేకరించి వాటిని ప్రయోగశాలలో మేలైన ఆంబోతుల వీర్యం ద్వారా ఫలదీకరణ చేస్తారు. ఆ పిండాలను ఎదకు వచ్చిన ఆవుల గర్భాశయంలోకి ప్రవేశపెట్టి మేలు రకం దూడలను పుట్టిస్తారు. ఈ పద్ధతి ద్వారా 100 శాతం దేశవాళి ఆవుజాతి (సాహివాల్‌) లక్షణాలతో జన్మించిన దూడలకు మొదటి తరంలోనే సుమారు 3000 లీటర్ల పాల ఉత్పత్తి సామర్థ్యం వస్తుంది. 4-5 తరాలు దూడలను పుట్టించి వాటి ద్వారా వచ్చిన ఆంబోతులను వీర్య సేకరణకు ఉపయోగించి కృత్రిమ గర్భధారణ చేయడం ద్వారా దేశవాళి ఆవుల పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఒక ఈత కాలంలో 5,000-6,000 లీటర్ల (రోజుకు 15-20 లీటర్లు) వరకు పొందవచ్చు.

అన్నదాతలు ముందుకు రావాలి

నెల క్రితం రాయికల్‌, ముస్తాబాద్‌, తిమ్మాపూర్‌, బరంకల్‌ తదితర మండలాల్లో రైతుల వద్దనున్న 45 ఆవుల్లో పిండ మార్పిడిని ప్రవేశపెట్టాం. మేలుజాతి దేశవాళి ఆవుల సంతతిని అభివృద్ధి చేస్తే ఎక్కువ పాల ఉత్పత్తి, ఆరోగ్యకరమైన పాలు, నికర ఆదాయం పొందవచ్చు. దేశీయ ఆవులు ఉన్న అన్నదాతలు పిండ మార్పిడి పద్ధతికి ముందుకు రావాలి. మేలు రకం పాలను తాగడంవల్ల రోగ నిరోధకశక్తి పెరిగి రోగాలు దరికి చేరవు. నికర ఆదాయం పెరుగుతుంది.

- డా.కె.రాంచంద్రారెడ్డి, ప్రధాన ఆచార్యులు

ఇదీ చూడండి: Dengue effect: రాష్ట్రంలో డెంగీ విజృంభణ.. ఆ జిల్లాలపై తీవ్ర ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.