ETV Bharat / state

Girl Dancing with Artificial Legs in Jagtial : 'జూనియర్ సుధా చంద్రన్‌'.. ఈ బాలిక ఎంతో మందికి స్ఫూర్తి.. - జగిత్యాల జిల్లా వార్తలు

Girl Dancing with Artificial Legs in Jagtial : ఆ చిన్నారికి ఏడాది కాలంలో రెండు పర్యాయాలు.. తన రెండు కాళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఆమె లక్ష్యానికి కృత్రిమ కాలు కొత్త ఊపిరి పోసింది. ఇతరులు ఏదైతే తను సాధించలేదని సానుభూతి ప్రకటించారో.. దానిపైనే మమకారం పెంచుకుని విజయం సాధించింది. పట్టుదలతో నృత్యం నేర్చుకుని.. వీక్షకుల మనసు దోచుకుంటోంది.

anjanaa sri
anjanaa sri
author img

By

Published : May 22, 2023, 2:33 PM IST

ఆకాశమే హద్దుగా.. అంజనాశ్రీ ఆత్మవిశ్వాసం

Girl Dancing with Artificial Legs in Jagtial : సుధా చంద్రన్.. కాలు కోల్పోయినా పట్టుదలతో తన నృత్యంతో అందరినీ ఆశ్చర్యపర్చడమే కాకుండా.. ఎంతో మంది మదిలో స్ఫూర్తిని రగిల్చింది. అదే మాదిరి చిన్న వయసులో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.. జగిత్యాల జిల్లాకు చెందిన ఈ బాలిక. ఆ జూనియర్ సుధా చంద్రన్ కథేంటో మీరూ చూడండి.

జగిత్యాల జిల్లా రాయికల్ మండలానికి చెందిన అంజన శ్రీ.. నాలుగేళ్ల వయసులో ఇంటి ముందు ఆడుకుంటుండగా స్కూల్ బస్సు వచ్చి ఢీకొట్టడంతో కాలు తీసేయాల్సి వచ్చింది. చిన్నారిని చూసి తల్లిదండ్రులు కుంగిపోయారు. హైదరాబాద్​లోని ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించి కృత్రిమ కాలు అమర్చారు.

రెండోసారీ ప్రమాదం..: కానీ అంజన శ్రీ మాత్రం ఆ బాధ నుంచే గుండె ధైర్యాన్ని కూడగట్టుకుంది. డ్యాన్స్ నేర్చుకోవాలన్న తన కోరికను తల్లిదండ్రులకు చెప్పి కృత్రిమ కాలుతో ప్రయత్నాలు ప్రారంభించింది. స్థానికంగా ఉన్న ఓ మాస్టర్ దగ్గర కూచిపూడి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. అంతా బాగుంది అనుకున్న సమయానికి.. కారు ప్రమాదంలో మరో కాలికి తీవ్ర గాయాలు కావడంతో.. శస్త్ర చికిత్స చేసి కాలు లోపల రాడ్లు వేశారు.

ఆకట్టుకున్న నాట్య ప్రదర్శన..: ఒకటేమో కృత్రిమ కాలు, మరో కాలికి తీవ్ర గాయాలు.. ఇలా ఉన్నా కూచిపూడిని ఇష్టంగా నేర్చుకుంది. గత కొన్ని రోజులుగా స్థానికంగా జరిగే కార్యక్రమాల్లో నాట్య ప్రదర్శన చేస్తూ.. అందరినీ ఆకట్టుకుంటోంది అంజన శ్రీ. ఇటీవల హైదరాబాద్​లోని త్యాగరాజ కళాభవన్​లోనూ నాట్య ప్రదర్శన చేయడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది.

"నాకు నాట్యమంటే చాలా ఇష్టం. కూచిపూడి నాట్యం నేర్చుకున్నాను. కొన్ని చోట్ల ప్రదర్శనలిచ్చాను. భవిష్యత్త్​లో డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. జీవితంలో ఒక్కసారైనా సుధాచంద్రన్​ గారిని కలవాలని ఉంది". - అంజన శ్రీ

ఒక్కసారైన కలవాలని..: సుధాచంద్రన్​ జీవిత చరిత్రను ఈ అమ్మాయి మళ్లీ గుర్తు చేసింది. ఇంతటి ఆత్మవిశ్వాసంతో ఉన్న అంజన శ్రీని చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. భవిష్యత్త్​లో డాక్టర్ అవ్వాలన్న తన లక్ష్యాన్ని సాధిస్తానంటోంది అంజన శ్రీ. తనకు ఆదర్శప్రాయమైన సుధాచంద్రన్​ను జీవితంలో ఒక్కసారైన కలవాలని.. ఆమెతో కలిసి డ్యాన్స్ చేయాలంటోంది అంజన శ్రీ.

తల్లి ప్రోత్సాహంతోనే..: ఇప్పుడు అంజన శ్రీని అందరూ అభినందిస్తున్నా.. ఆమె చాలా మానసిక క్షోభని అనుభవించింది. ఒక కాలుతో డ్యాన్స్ చేయలేదని కొందరు.. అమ్మాయి అదృష్టం బాలేదని ఇంకొందరు.. ఇలా మాటలు అన్నప్పటికీ.. ఆమె వెనకడుగు వేయలేదు. మొదట్లో కృత్రిమ కాలుతో ఇబ్బందిపడ్డ అంజన శ్రీకి.. తల్లి సపర్యలు చేసి ప్రోత్సహించింది.

"మొదట్లో నాట్యం నేర్చుకునేటప్పుడు కాలునొప్పితో బాధపడేది. తర్వాత ప్రాక్టీస్ చేస్తుంటే నొప్పి తగ్గింది. ఆమెకు స్ఫూర్తివంతంగా ఉంటుందని సుధాచంద్రన్ నాట్యం చేసే వీడియోలు చూపించాను. సుధాచంద్రన్‌ను కలవాలని కోరుకుంటోంది". - గౌతమి, అంజన శ్రీ తల్లి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.