జగిత్యాల జిల్లా ధర్మపురి, బుగ్గారం మండలాల్లో భారీ వర్షం కురిసింది. చిన్నాపూర్ వద్ద 63వ నెంబర్ జాతీయ రహదారిపై నుంచి వరదనీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సహజ కాల్వలను కబ్జాదారులు ఆక్రమించడంతోనే వరద వల్ల ఇబ్బందులు వస్తున్నాయని పలు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువత సహకారం
వరద ప్రవాహం తగ్గాక వెలుగొండ, చిన్నపూర్ గ్రామానికి చెందిన యువకులు ట్రాఫిక్కు మరింత ఇబ్బంది కాకుండా ఉండేందుకు వాహనదారులకు సహకరించారు. నేరేళ్ల, బుగ్గారం గ్రామాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇవీ చూడండి : అత్తింటి నుంచి వివాహిత అదృశ్యం.. పోలీసులకు భర్త ఫిర్యాదు