ETV Bharat / state

సాగు తీరు మారుతోంది..! - oil palm cultivation in jagtial district

జగిత్యాల జిల్లాలో నియంత్రిత సాగు ప్రణాళికను అధికారులు ఆవిష్కరించారు. గతంలోని పంటల సాగులో మక్క, వరి తదితర కొన్నింటి విస్తీర్ణంను తగ్గించగా మరికొన్ని పంటల సాగు పెంచాలని నిర్ణయించారు. ఈ సారి తొలిసారిగా ఆయిల్‌పామ్‌ అన్నదాతల క్షేత్రాల్లో అడుగిడనుండగా నూతన సాగు ప్రణాళిక ఇలా ఉండనుంది.

agriculture officers released cultivation plan in jagtial district
సాగు తీరు మారుతోంది..!
author img

By

Published : May 23, 2020, 10:08 AM IST

జగిత్యాల జిల్లాలో నియంత్రిత సాగు ప్రణాళిక తయారయింది. మొదటిసారిగా ఆయిల్​పామ్ అన్నదాతల వ్యవసాయక్షేత్రాల్లో అడుగుపెట్టనుంది. నూతన సాగు ప్రణాళిక వివరాలు...

  • జగిత్యాల జిల్లాలో వరిని సాధారణంకన్నా 2,885 ఎకరాలను తగ్గించగా రైతులు పండించాల్సిన రకాల్లో సగం దొడ్డుగింజవి, సగం సన్నగింజ రకాలుండాలి. 5.5 శాతంగా వరి పంట నుంచి ఆయిల్‌పామ్‌కు మళ్లాలి.
  • పత్తి విస్తీర్ణాన్ని 9,774 ఎకరాలు అదనంగా పెంచగా మక్కను వేసే 18.7 శాతం రైతులు పత్తిపంటకు మళ్లాలి.
  • కంది విస్తీర్ణాన్ని కూడా 17,753 ఎకరాలు అదనంగా నిర్దేశించగా మక్కను వేసే 33.9 శాతం రైతులు కందిని తప్పనిసరిగా వేయాలి.
  • మక్క నుంచి పెసరకు 6.6 శాతం మళ్లాల్సి ఉండగా మక్క నుంచి ఆయిల్‌పామ్‌కు 51.6 శాతం మంది రైతులు మళ్లాల్సిఉంది. ఈ సంవత్సరం తొలిసారిగా 13 మండలాల్లో ఆయిల్‌పామ్‌ను వేస్తుండగా ఇప్పటికే చాలామంది రైతులు దరఖాస్తు చేసిఉన్నారు.
  • ఏ గ్రామ రైతులు ఏ పంటను వేయాలనేది ఏఈఓ క్లస్టర్లవారీగా నిర్ణయిస్తారు. జిల్లాలో మామిడి, పసుపు, ఉల్లి, మిరప తదితర ఉద్యానపంటల సాగును స్థిరంగా ఉంచగా పట్టణాల శివారు గ్రామాల్లో కూరగాయలను ప్రోత్సహించనున్నారు.
  • పసుపు, మిరపలో మిశ్రమ పంటగా మొక్కజొన్నకు అనుమతి ఉన్నా మక్కలను మాత్రం కొనుగోలుచేసే పరిస్థితి ఉండదు. మక్క నుంచి వందశాతం విస్తీర్ణాన్ని తప్పించి పత్తి, కంది, ఆయిల్‌పామ్‌ తదితర పంటలకు మళ్లించేలా అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తారు.
  • క్లస్టర్ల వారీగా పంటలసాగు పటాలను సిద్ధంచేసి రైతులు ఏయే పంటలను వేయాలనేది అవగాహన కల్పిస్తారు. సోయాబీన్‌, కంది తదితర పంటల విత్తనాలను రాయితీపై ఇవ్వనుండగా అవసరమున్న పత్తి విత్తన ప్యాకెట్లను ప్రైవేటు కంపెనీల ద్వారా సరఫరా చేయిస్తారు.
  • వరిలో జాతీయ ఆహార భద్రత పథకం ద్వారా విత్తనాలకు పరిమిత రాయితీ ఉండగా ప్రైవేటుగా సరఫరా చేసే విత్తనాలపైనా ప్రభుత్వం నియంత్రణ కొనసాగుతుంది.
  • కర్షకులు కోరుతున్నవి
  • సన్నగింజ వరి సాగులో చీడపీడల సమస్య ఎక్కువగా ఉండటం, పెట్టుబడి ఖర్చు అధికం కావటం, తక్కువ దిగుబడి రావడంతో క్వింటాలు ధాన్యానికి కనీసం రూ.2,200 ధర ఉండేలా ప్రభుత్వం సేకరణ జరపాలి లేదా ఎగుమతి అవకాశాలను కల్పించాలి.
  • గతంలో పత్తిని సీసీఐ ద్వారా నామమాత్రంగా కొనుగోలు చేయగా ఈ సారి సాగు పెరిగితే దూది విక్రయ ఇక్కట్లను తీర్చేలా సేకరణ మొత్తాన్ని పెంచాలి
  • ఇప్పటికే గత వానాకాలంలో 10 ఎకరాల్లోపు, గత యాసంగిలో 5 ఎకరాల్లోపు వారికే రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం నిధులను అందించగా ఇంతకన్నా ఎక్కువ భూమి ఉన్నవారికి చెల్లింపులు జరపలేదు. ఈ నేపథ్యంలో గత బకాయిలను చెల్లించి రైతుబంధుకు, సాగు విస్తీర్ణంనకు లింకు పెట్టవద్ధు.
  • కంది, మినుము, పెసర, సోయాబీన్‌ తదితరాల్లో పరిమిత సేకరణనే జరుపుతుండగా మున్ముందు మార్కెట్‌లో ధరతగ్గిన ప్రతి పంటను కొనేలా చర్యలు చేపట్టాలి. సాగుకు ముందుగానే ఉత్పత్తుల అమ్మకాలపై భరోసా కల్పించాలి.
  • వ్యవసాయ యాంత్రీకరణ, బిందుసేద్యం, హరితగృహాలు, కూరగాయల విత్తనాలు తదితర చాలారకాల పంట ఉత్పాదకాలపై రాయితీని నిలిపివేయగా గతంలో మాదిరిగా రాయితీలను పునరుద్ధరించాలి.
  • వరినాట్లు, పత్తిఏరటం, కంది నూర్పిడి, పసుపుతీత తదితరాల్లో కూలీల సమస్య ఉన్నందున ఉపాధిహామీ పనులను సాగుపనులకు అనుసంధానించాలి.

రైతులందరూ సహకరించాలి

నియంత్రిత సాగు ప్రణాళికకు రైతులందరూ సహకరించాలి. ప్రతిరైతుకూడా సన్నగింజ వరిని తప్పనిసరిగా వేయాలి. ఆయిల్‌పామ్‌ సాగు పెరగనుండగా విత్తనాలు లభిస్తే సోయాబీన్‌ను కూడా మరింత అధిక విస్తీర్ణంలో పండించే వీలుంది.

- పాక సురేశ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి, జగిత్యాల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.