మత్స్య కార్మికులకు రాయితీపై ఇచ్చే వాహనాల విషయంలో లబ్ధిదారుల నుంచి 60 వేలు లంచం తీసుకుంటూ జగిత్యాల మత్స్యశాఖ జిల్లా అధికారి రాణా ప్రతాప్, సీనియర్ సహాయకుడు నూరొద్దీన్ ఏసీబీ అధికారులకు చిక్కారు. మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌కు చెందిన పల్లికొండ ప్రవీణ్, ఎల్ల రవీందర్ల నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా డబ్బులు ఇవ్వనిదే పని చేయలేమని అధికారులు ఒత్తిడి చేశారని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: 'కారు ఢీకొన్నాడని... దారుణంగా చితగ్గొట్టారు'