విద్యార్థులకు సరిపడా బస్సుల సంఖ్య పెంచాలని కోరుతూ జగిత్యాల ఆర్టీసీ డిపో ముందు ఏబీవీపీ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. డిపో ముందు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పరిమితికి మించి ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే బస్సుల సంఖ్య పెంచాలని డిమాండు చేశారు. ఆర్టీసీ డిపో మేనేజరుకు వినతి పత్రం అందజేసి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఇదీ చూడండి :చంద్రయాన్-2: ఒక లక్ష్యం- వెయ్యి మెదళ్లు