జగిత్యాల పట్టణంలోని తులసినగర్‌కు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ అద్బుతమైన విగ్రహాన్ని తయారు చేసి ఔరా అనిపించాడు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని గుండుపిన్నుపై ఇమిడేలా తల్లి తన బిడ్డను మోకాలుపై ఆడిస్తున్నట్లుగా ఓ కళాఖండాన్ని రూపొందించి అందరిని ఆశ్చర్యపరిచాడు.
నైలాన్ వైర్, కలర్‌ను వాడుతూ.. గుండుపిన్నుపై విగ్రహాన్ని రూపొందించడానికి తనకు 8 గంటల సమయం పట్టిందని దయాకర్ తెలిపారు. గత కొన్నేళ్లుగా ఈ సూక్ష్మ విగ్రహాలు, వస్తువులను తయారు చేస్తున్నానన్న ఆయన అమ్మ గొప్పతనాన్ని తెలిపేలా ఈ కళాఖండాన్ని రూపొందించానని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: వయసు 70 దాటినవారికి పడకలు గగనమే