జగిత్యాల నుంచి ముంబైకి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మూడు ప్రైవేట్ బస్సులను జగిత్యాల రవాణా శాఖ అధికారి కిషన్ రావు సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ముంబైకి ప్రయాణికులను తీసుకెళ్తుండగా జగిత్యాల- నిజామాబాద్ రహదారిపై పట్టుకున్నారు. అందులో ఉన్న ప్రయాణికులను దింపి మూడు బస్సులను సీజ్ చేశారు. బస్సులపై కేసు నమోదు చేసినట్లు రవాణా శాఖ అధికారి తెలిపారు.
ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'