ఒక్క వరదకే సీఎం కేసీఆర్ ఎన్ని కష్టాలొచ్చాయంటూ వైస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. అందరి కుట్రలు అయిపోయి.. తాజాగా అంతర్జాతీయ కుట్రల వరకు వచ్చారని సెటైర్ వేశారు. క్లౌడ్ బరస్ట్ అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ట్వీట్ చేశారు. ఆంధ్రోళ్ల అణిచివేతలు.. ప్రతిపక్షాల పన్నాగాలు అయిపోయి తాజాగా కొత్త కుట్రలు మొదలయ్యాయని అన్నారు.
ఆంధ్రోళ్ల అణిచివేతలైపోయినయ్.. ప్రతిపక్షాల పన్నాగాలు అయిపోయినయ్.. తిరుగుబాటుదారుల వెన్నుపోటులు అయిపోయినయ్.. జాతీయ పార్టీల జిమ్మిక్కులు అయిపోయినయ్.. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అయిపోయింది.. ఇక అంతర్జాతీయ కుట్రలు మొదలైనయ్. ఒక్క వరదకే మన సీఎం కేసీఆర్‌కు ఎన్ని కష్టాలొచ్చినయ్’.
- వైఎస్ షర్మిల, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు
ఇంతకీ సీఎం కేసీఆర్ ఏమన్నారంటే?
క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి ఏదో వచ్చింది. దీని వెనుక ఏవో కుట్రలున్నాయని చెబుతున్నారు. ఎంత వరకు కరెక్టో తెలియదు. ఇతర దేశాల వాళ్లు కావాలనే మన దేశంలో అక్కడక్కడా క్లౌడ్‌బరస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఒకసారి కశ్మీర్ దగ్గర లద్దాఖ్‌లో, లేహ్‌లో ఇలా చేశారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లో చేశారు. ఈ మధ్య గోదావరి పరీవాహక ప్రాంతంపైనా చేస్తున్నట్లు మనకు చూచాయగా సమాచారం ఉంది’’ వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో షర్మిల స్పందిస్తూ ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి:
- Konda on cloud burst: 'క్లౌడ్ బరస్ట్ ఎక్కడ పడితే అక్కడ కుదరదు'
- టేస్టీ సోయా దోశ.. ఎముకలకు బలం.. గుండె జబ్బులకు చెక్!