ఆంధ్రప్రదేశ్లోని చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తి కళాకారులకు జగనన్న తోడు పథకం రెండో విడత సొమ్ము నేడు విడుదల కానుంది. 370 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ విడుదల చేస్తారని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ భరత్ గుప్తా ప్రకటించారు. 37 లక్షల మందికి రూ.10 వేల చొప్పున లబ్ధి చేకూరనుందని తెలిపారు.
ఈ మొత్తంపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని..... అసలును సకాలంలో చెల్లించినవారికి బ్యాంకులు ఏటా తిరిగి 10 వేల వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేస్తాయని స్పష్టం చేశారు. జగనన్న తోడు తొలి, రెండు దశల్లో కలిపి మొత్తం 905 కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు వివరించారు. రూ.48.77 కోట్ల వడ్డీని బ్యాంకులకు రాష్ట్రమే చెల్లిస్తుందని వెల్లడించారు.
ఇదీ చదవండి:
Covid Third Wave: పీడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయండి: సీఎం జగన్