ETV Bharat / state

హిజ్రాలకు సారీ చెప్పిన షర్మిల.. ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదంటూ..! - Sharmila comments

YS Sharmila apologized to Transgenders: వైఎస్ షర్మిల హిజ్రాలకు క్షమాపణలు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా హిజ్రాల పట్ల తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. హిజ్రాల మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు కోరుతున్నా అంటూ బహిరంగంగా తెలిపారు. ఇక తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని.. రాష్ట్రపతి పాలన విధించాలని పేర్కొన్నారు.

YS SHARMILA
YS SHARMILA
author img

By

Published : Feb 22, 2023, 4:23 PM IST

YS Sharmila apologized to Transgenders: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా ట్రాన్స్‌జెండర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మహబూబాబాద్‌లో షర్మిల.. తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ.. హిజ్రాలు ఫైర్ అవుతున్నారు. షర్మిల వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని ట్రాన్స్‌జెండర్లు డిమాండ్ చేశారు. షర్మిల ఫ్లెక్సీలు సైతం దగ్ధం చేయడంతో వారి ఆందోళనపై ఆమె రియాక్ట్ అయ్యారు.

తన మాటలపై ట్రాన్స్‌జెండర్లు బాధపడితే.. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ క్షమాపణ కోరుతుందని పేర్కొన్నారు. వైఎస్ఆర్‌టీపీ అధికారంలోకి వచ్చాక హిజ్రాలను ఆదుకునే బాధ్యత తమది అని హామీనిచ్చారు. హిజ్రాల విషయంలో వారి మనోభావాలను కించపరిచినట్లు భావిస్తే... అందుకు క్షమాపణ చెప్తున్నట్లు తెలిపారు. వారికి బేషరతుగా క్షమాపణలు కోరారు. ఎమ్మెల్యే విషయంలో తానూ హిజ్రాల గురించి తప్పుగా మాట్లాడిందేమీ లేదని ఆమె అన్నారు.

ఉద్దేశపూర్వకంగా హిజ్రాల పట్ల తప్పుగా మాట్లాడలేదు. హిజ్రాల మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు కోరుతున్నా.. తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి. బీఆర్ఎస్ నేతలు గుండాల వలే వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాలపై బీఆర్ఎస్ నేతలు దాడులకు దిగుతున్నారు. - షర్మిల, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు

ఇక తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని.. రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ కార్యకర్త పవన్‌ను పరామర్శించారు షర్మిల. వైద్యులతో మాట్లాడి పవన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రౌడీల రాజ్యం నడుస్తుందని.. పోలీసులు బీఆర్ఎస్ ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై దాడులు చేస్తారా అంటూ ధ్వజమెత్తారు.

ప్రతిపక్షాలు ప్రజల పక్షాన మాట్లాడితే ఈ తెలంగాణ ప్రభుత్వానికి నేరంగా కనిపిస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ గుండాల చేతిలో గాయపడ్డ పవన్ కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు చెప్పారని షర్మిల పేర్కొన్నారు. తన పాదయాత్ర సమయంలోనూ దాడులు చేశారని గుర్తు చేశారు. నర్సంపేట, మహబూబాబాద్‌లలో దాడి చేసి పాదయాత్రను ఆపారని షర్మిల చెప్పుకొచ్చారు. పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల్లా మారారని శాంతిభద్రతల పర్యవేక్షణలో పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిజ్రాలకు సారీ చెప్పిన షర్మిల.. ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదంటూ..!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.