హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని.. గెలిచిన వాళ్లు యువతను ప్రోత్సహించాల్సిన అవసరముందని వి.హెచ్ సూచించారు. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు ఖ్యాతి పెంచాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ హెచ్‌సీఏ అభివృద్ధే లక్ష్యంగా కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి :'రాజకీయాల్లో ఉండాల్సింది సిన్సియారిటీ... సీనియారిటీ కాదు'