ఈ పరిస్థితిలో శివకు హోం ఐసోలేషన్ ఉడటం అనేది ఇబ్బందిగా మారింది. ఇంట్లో ఉంటే కుటుంబసభ్యులకు కరోనా వస్తుంది. ఉన్నదేమో ఒకటే గది. బయట ఎవరూ ఆశ్రయం ఇచ్చేలా లేరు. ఏం చేయాలని ఆలోచించిన శివకు తన ఇంటి ముందు ఉన్న చెట్టు పరిష్కారం చూపించింది. ఆ చెట్టుపైనే మంచె కట్టుకొని ఆవాసం ఏర్పాటు చేసుకున్నాడు. తొమ్మిది రోజులుగా కుటుంబసభ్యులు ఇచ్చిన ఆహారం, నీళ్లను తాడు సాయంతో పైకి తీసుకుంటున్నాడు.
ఇది చూసిన గ్రామస్థులు అతని సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూనే... మరోవైపు జాలి పడుతున్నారు. ఇప్పటికైనా... ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి గ్రామపంచాయతీలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో బాధితులకు కావల్సిన వసతులు కల్పించాలని కోరుతున్నారు.