యువకుడు టిక్‌టాక్‌లో నటించడం, స్టంట్స్ చేయడం, పాటలు పాడటం చేసేవాడు. అయితే ఇటీవల చేసిన వీడియోలకు గత కొన్ని రోజులుగా లైకులు రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా టిక్‌టాక్‌లో లైకులు రావట్లేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని విచారణలో తేలిందని నోయిడా అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రణ్‌విజయ్ సింగ్ తెలిపారు. అయితే, ఇంట్లో ఎలాంటి సూసైడ్ లెటర్ లభ్యం కాలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
టిక్‌టాక్‌లో లైకులు రావట్లేదని ఆత్మహత్య! - young boy Suicide for likes are not coming on ticktalk
సామాజిక మాధ్యమంలో లైకులపై ఉన్న వ్యామోహం ఓ యువకుడిని ఆత్మహత్యకు పాల్పడేలా చేసింది. టిక్‌టాక్‌లో తాను చేసిన వీడియోలకు లైకులు రావట్లేదన్న కారణంతో 18 ఏళ్ల యువకుడు తీవ్ర మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం నోయిడాలోని సాలార్పూర్‌లో జరగ్గా ఒక రోజు ఆలస్యంగా వెలుగుచూసింది.
![టిక్‌టాక్‌లో లైకులు రావట్లేదని ఆత్మహత్య! young boy Suicide for likes are not coming on ticktalk](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6843199-750-6843199-1587206975865.jpg?imwidth=3840)