పండ్ల మార్కెట్లో పారిశుద్ధ్య పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన వైజే పద్మహర్ష అన్నారు. కొవిడ్ కట్టడిలో భాగంగా సిబ్బంది, కమీషన్ ఏజెంట్లు, హమాలీలకు టీకాలు వేయించడాన్ని ద్వితీయ ప్రాధాన్యత అంశంగా తీసుకుంటానని పేర్కొన్నారు.
దక్షిణ భారతదేశంలో అతి పెద్ద పండ్ల మార్కెట్‌లో పెద్ద ఎత్తున అవినీతి, నిబంధనలకు విరుద్ధంగా కొత్త లైసెన్సుల జారీ వివాదంలో కీలక పాత్ర పోషించిన సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటుతోపాటు కుంభకోణంపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొత్త కార్యదర్శిగా పద్మహర్షను నియమించింది. నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు పలువురు మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది, మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు, కమీషన్ ఏజెంట్లు, వర్తకులు అమెకు అభినందనలు తెలియజేశారు.
ఇదీ చూడండి: అధిక ఫీజులపై ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు