రాష్ట్ర కార్యవర్గంలో యాదవులకు ప్రాధాన్యత కల్పించకపోతే రాబోయే ఎన్నికల్లో భాజపాకు తగిన బుద్ధి చెబుతామని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ హెచ్చరించారు. అమీర్‌పేట్‌లోని ఆ సంఘం కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
33 జిల్లాల్లో కాషాయ పార్టీ స్టేట్కమిటీలో యాదవులకు ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా శనివారం రాష్ట్రంలో పార్టీ కార్యాలయం ముందు యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సత్యాగ్రహ దీక్ష చేయనున్నట్లు తెలిపారు. సత్యాగ్రహానికి జిల్లాల నుంచి తరలిరావాలని యాదవులకు సూచించారు
ఇదీ చూడండి : పరిశ్రమల్లో అత్యధిక ఉద్యోగాలు స్థానికులకే..