సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముషీరాబాద్‌లో... ప్లాస్టిక్‌ను నివారిద్దాం-పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ నినాదాలు చేశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న కలుషిత వ్యర్థాలను ఉత్పత్తిని అరికట్టడమే లక్ష్యంగా అందరూ ముందుకు సాగాలని జీహెచ్ఎంసీ అధికారిణి ఉమాప్రకాశ్ వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక మసీదులో ప్రార్థన చేయటానికి వచ్చిన ముస్లిం సోదరులకు మొక్కలు పంపిణీ చేశారు.
ఇవీ చూడండి: పర్యావరణ పరిరక్షణకై దక్షిణ మధ్య రైల్వే