దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఆలోచనలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బెల్ పరిశ్రమ వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు.
బెల్ మెయిన్ గేట్ ముందు గాంధీ విగ్రహం వద్ద "348" పీఎస్యూల ప్రైవేటీకరణకు నిరసనగా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడండి, రిజర్వేషన్లు అమలు చేయాలని ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి, రిజర్వేషన్లను ఎత్తివేసే ఆలోచన తక్షణమే మానుకోవాలని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 94% మంది ఆసుపత్రికి వెళ్లకుండానే కొవిడ్ నుంచి కోలుకుంటున్నారు