Womens Reaction on Free Bus Service : రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈరోజు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) అసెంబ్లీ ప్రాంగంణంలో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఇక పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తించనుంది. మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, ట్సాన్స్‌జెండర్‌లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న రేవంత్‌రెడ్డి - మహాలక్ష్మి పథకం ప్రారంభం
Mahalakshmi Scheme in Telangana : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్‌ల్లో మహాలక్ష్మి పథకాన్ని మహిళలతో కలిసి అధికారులు ప్రారంభించారు. అతివలకు ప్రభుత్వం నుంచి వచ్చిన మహాలక్ష్మి పథకం(mahalakshmi scheme) ఉచిత టికెట్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రయాణికులకు ఉచిత ప్రయాణంపై అవగాహన కల్పించారు. ఉచిత ప్రయాణ సౌకర్యం నేటి నుంచి ప్రారంభం కావడంతో ఆర్టీసీ ప్రాంగాణాల్లో పెద్ద ఎత్తున మహిళలు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు తరలివచ్చారు.
CM Revanth inaugurates Freebus Service : పేద, మధ్య తరగతి మహిళలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోందని అతివలు హార్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా సులువుగా అమలయ్యేలా మార్గదర్శకాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. మహలక్ష్మీ పేరిట మహిళలకు ఉచిత ప్రయాణ పథకానికి మహిళల నుంచి విశేష స్పందన వస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించడంపై అతివలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపై ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితమే- మహిళలంతా మస్త్ ఖుష్
హైదారబాద్‌లో కలెక్టర్ అనుదీప్ ఉచిత బస్ సౌకర్యాన్ని జెండా ఊపి ప్రారంభించారు. మహిళలకు జీరో ఛార్జీ టికెట్లను ఇచ్చారు. అనంతరం బస్సులో ప్రయాణించారు. సిద్దిపేటలో మహాలక్ష్మి పథకాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. ములుగు, మహబుబాబాద్, కరీంనగర్లో ఆయా జిల్లా కలెక్టర్లు ప్రారంభించారు.
ఈ పథకంతో ఒక్కో ఇంట్లో కనీసం 3 వేల రూపాయల ఆదా అవుతుందని మహిళలు పేర్కొన్నారు. ముఖ్యంగా ఎలాంటి పాస్‌లు లేకుండా ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించినందుకు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పథకం ప్రారంభమైన సందర్భంగా ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలు సందడి చేశారు. టపాసులు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు.
మహాలక్ష్మి పథకం గురించి ఆర్టీసీ అధికారులు ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతను ఇస్తూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం హర్షణీయమని మహిళలు తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా ఉచితప్రయాణం కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉచిత ప్రయాణంతో ఆర్థికంగా ప్రయోజనం - మహాలక్ష్మి పథకంపై మహిళల ఆనందం