ETV Bharat / state

టీఎన్​జీవోలో మహిళా దినోత్సవం

author img

By

Published : Mar 6, 2020, 3:20 PM IST

హైదరాబాద్​ నాంపల్లిలోని టీఎన్​జీవో కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వివిధ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఇలా అన్ని వర్గాల మహిళలు ఈ వేడుకలలో ఉత్సహంగా పాల్గొన్నారు.

women's day celebrations in nampally tng office for the occasion of international women's day
టీఎన్​జీవోలో ఘనంగా మహిళా దినోత్సవాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని నాంపల్లిలోని టీఎన్‌జీవో కార్యాలయంలో వేడుకలను ఘనంగా జరిపారు. మూడు రోజులపాటు నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళా ఉద్యోగులకు వివిధ అంశాలపై పోటీలు పెట్టారు. చివరి రోజున మహిళల భద్రత-చట్టాలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి టీఎన్టీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్‌, మహిళా విభాగం ఛైర్‌ పర్సన్‌ బండారు రేచల్‌, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగ మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని రవీందర్‌రెడ్డి తెలిపారు.

మహిళా ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు, ఇతర విషయాలపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి చర్చించనున్నట్లు తెలిపారు. మహిళలో దాగిఉన్న సృజనాత్మక శక్తితో పాటు వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించే విధంగా వేడుకలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

టీఎన్​జీవోలో ఘనంగా మహిళా దినోత్సవాలు

ఇదీ చూడండి: కేసీఆర్ కృషితో ప్రగతిపథంలో రాష్ట్రం: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.