కూరగాయలు అమ్మేందుకు వచ్చిన ఓ మహిళ ఇంట్లో వారి దృష్టిని మరల్చి దొంగతనానికి పాల్పడిన ఘటన కార్ఖాన పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక గృహలక్ష్మి కాలనీలో నివాసముంటున్న విక్రంరెడ్డి దంపతులు ఇంట్లో గుర్తు తెలియని ఓ మహిళ దొంగతనానికి పాల్పడింది. 5 తులాల బంగారం, నాలుగు వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరిసరాలు గాలించి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
ఆలస్యంగా గుర్తించాం...
తమ ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించినట్లు ఇంటి యజమాని వందన తెలిపారు. కూరగాయలు అమ్మే మహిళ తన దృష్టి మరల్చి దొంగతనానికి పాల్పడినట్లు గ్రహించలేకపోయానని అన్నారు.
ఇదీ చూడండి : బిగ్బాస్ నిర్వాహకులపై సినీనటి గాయత్రీగుప్తా ఫిర్యాదు