ETV Bharat / state

మహిళా పోలీసుకు పాదపూజ

కరోనా కట్టడి కోసం నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా పోలీసును ఆమె కుటుంబీకులు వినూత్నంగా గౌరవించారు. ఆమె పనితీరును అభినందిస్తూ కాళ్లు కడిగి పాదపూజ చేశారు.

author img

By

Published : Apr 24, 2020, 5:13 AM IST

మహిళా పోలీసుకు పాదపూజ
మహిళా పోలీసుకు పాదపూజ

హైదరాబాద్ చైతన్యపురి పీఎస్​లో మహిళా ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న సంధ్య... కరోనా కట్టడి కోసం చేస్తున్న కృషిని అభినందిస్తూ ఆమె కుటుంబీకులు కొత్త తరహాలో గౌరవించారు. ఆమె పనితీరుకు ముగ్ధులైన భర్త సుబాన్‌... ఆమెను అభినందిస్తూ పాదపూజ చేసి సన్మానించారు. కరోనాకు ఎవరూ బలికాకూడదని కుటుంబాలను సైతం వదిలి బాధ్యతగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని సంధ్య తెలిపారు. కుటుంబం మొత్తం కొండంత అండగా నిలువడం బలంగా భావిస్తున్నానన్నారు. ప్రజలు సైతం తమ విధులకు సహకరించాలని ఆమె కోరారు.

ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.