దిల్లీ కేెంద్రంగా.. కొత్త చట్టాలను నిరసిస్తూ ఎముకలు కొరికే చలిలో.. 33 మంది రైతులు చనిపోయినా మోదీ సర్కారు కనికరం చూపట్లేదని వామపక్ష మహిళా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరాపార్క్ వద్ద 11రోజులుగా జరుగుతున్న నిరవధిక నిరాహర దీక్షల్లో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. రైతు ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు మోదీ సర్కారు పనిచేస్తోందని ఆరోపించారు.
చలో హైదరాబాద్‌కు పిలుపు
రాజధాని వేదికగా 28 రోజులుగా దేశవ్యాప్త రైతాంగం కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తుంటే.. కేంద్రం మొండి వైఖరి అవలంభిస్తోందని నేతలు ధ్వజమెత్తారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి మద్దతుగా.. ఈ నెల 30న వామపక్ష మహిళా సంఘాల నేతలు చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా.. సాగు చట్టాలు రద్దు, విద్యుత్ ఉపసంహరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, భారత జాతీయ మహిళా సమాఖ్య కార్యదర్శి డాక్టర్ రజిని, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్మ పద్మ, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సృజన తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితితో సహా పలు దేశాల నుంచి మద్దతు లభిస్తోంది. కానీ కేంద్రం కనికరం చూపట్లేదు. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం నల్ల చట్టాలు చేస్తూ రైతులకున్న రక్షణ వ్యవస్థలన్నింటిని కనుమరుగు చేస్తుంది.
-సృజన, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు
ఇదీ చదవండి:'భాజపా నేతలు బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకోవాలి'