ETV Bharat / state

సామాజిక మాధ్యమాలతో అమ్మాయిలు తస్మాత్​ జాగ్రత్త!!

కామాంధులు... ఎక్కడైనా ఉండొచ్చు... అంతెందుకు మనం వాడే సెల్​ఫోన్​లలో కూడా... అదేంటి అనుకుంటున్నారా... సామాజిక మాధ్యమాలను ఉపయోగించి అమాయక ఆడపిల్లల్ని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. మహబూబ్​నగర్​లో జరిగిన ఘటనతో.. ఇప్పటికైనా చిన్న పిల్లలకు ఫోన్​లు ఇచ్చే ముందు తల్లిదండ్రులు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది.

సామాజిక మాధ్యమాలతో అమ్మాయిలు తస్మాత్​ జాగ్రత్త!!
author img

By

Published : Aug 29, 2019, 3:22 PM IST

Updated : Aug 29, 2019, 4:54 PM IST

సామాజిక మాధ్యమాలతో అమ్మాయిలు తస్మాత్​ జాగ్రత్త!!

పెరుగుతున్న టెక్నాలజీ వినియోగం సరిగా లేకుంటే... అది శాపంగా మారిందనే చెప్పాలి. పిల్లల విషయంలో దీని నష్టం మరింత ఎక్కువ. ఇంట్లో పిల్లలు అడగ్గానే ఫోన్ ఇవ్వడం... వాళ్లు దానితో ఏం చేస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులకు పట్టించుకోకపోవడం... ఏదో ఒకరోజు సమస్యలను తెచ్చిపెడుతుంది.

తాజాగా ఓ పదో తరగతి అమ్మాయికి ఓ వ్యక్తి ఫేస్​బుక్​ ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయమే ఆమె ప్రాణం తీసింది. ఏమి తెలియని వయస్సులో ఆ పరిచయాన్ని స్నేహం అనుకుంది.. ఆ యువతి. దాన్నే అదునుగా తీసుకున్న ఆ వ్యక్తి... ఎక్కడైనా కలుద్దాం అన్నాడు. అమ్మాయి ఒప్పుకోవడంతో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్పుడే అతడిలో ఉన్న కామాంధుడు బయటకొచ్చాడు. లోబర్చుకునే ప్రయత్నం చేస్తుండగా... ఆమె ప్రతిఘటించింది. వెంటనే ఆ దుర్మార్గుడు బండరాయితో మోది హత్య చేశాడు. ఈ ఘటన మహబూబ్​నగర్​లో చోటుచేసుకుంది.

పదో తరగతి అమ్మాయికి ఫేస్​బుక్ అకౌంట్. సామాజిక మాధ్యమాల అవసరం వారి భవిష్యత్​కు ఉపయోగపడేంతవరకు సబబే. కానీ అపరిచితులతో పరిచయాలు, వారితో చాటింగ్​లు ఎప్పటికైనా ముప్పే. తెలిసీ తెలియని వయస్సుల్లోనే సామాజిక మాధ్యమాలను వాడటం సరికాదు. అమాయక యువతులను స్నేహం పేరుతో మోసం చేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు.

మన పక్కనే ఉన్న స్నేహితులను, తల్లిదండ్రులను వదిలేసి... ఎవరో ఎక్కడో పరిచయం లేని స్నేహాలు ఎంత వరకు భద్రం అనేది ఒక్కసారి విద్యార్థులు, యువత ఆలోచించాలి. ముఖ్యంగా విద్యార్థులపై తల్లిదండ్రుల నిఘా అవసరం. తెలిసీ తెలియని వయసులో చిన్నారులు వేసే తప్పటడుగులు.. తల్లిదండ్రులకు జీవితాంతం కన్నీటినే మిగులుస్తాయి. మహబూబ్ నగర్ ఘటనే ఇందుకు ఉదాహరణ. కాబట్టి తల్లిదండ్రులూ ఒకసారి ఆలోచించండి.

ఇదీ చూడండి: లోబర్చుకోవాలనుకున్నాడు... హత్య చేశాడు...

Last Updated : Aug 29, 2019, 4:54 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.