ETV Bharat / state

సింహం కోసం దేశాన్ని కదిలించింది

మనిషికి మనిషికి మధ్య బంధాలే పలుచనైపోతున్న రోజులివి. అలాంటిది ఒక మహిళకు, సింహానికి మధ్య బంధం ఒక దేశాన్నే కదిలించింది. ఒక జంతువును కొడుకుగా భావించి ఒక మహిళ చేసిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల జేజేలు అందుకుంటోంది.

author img

By

Published : Mar 6, 2020, 12:50 PM IST

woman fought for safe zoning lion in columbia
సింహం కోసం దేశాన్ని కదిలించింది

'నా ఇరవైయేళ్ల్ల కొడుకుని నా నుంచి దూరం చేశారు.. చిన్నప్పుడు నుంచి ఎంతో ప్రేమగా పెంచాను. నా దగ్గర ఉండేటప్పుడు బలంగా ఉండేవాడు. ఇప్పుడు బక్కచిక్కిపోయాడు. అలానే వదిలేస్తే మరణిస్తాడు. దయచేసి నా కొడుకుని రక్షించండి. తిరిగి నాకు అప్పగించండి' అని జూలియస్‌ టోరెస్‌ కన్నీళ్లు పెట్టినపుడు అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. ఒక జంతువు కోసం ఆమె పడుతున్న తపన వారికి వింతగా తోచింది. కానీ టోరెస్‌ పట్టు వీడలేదు. దానికోసం యుద్ధమే చేసింది.

చిత్రహింసల నుంచి కాపాడింది..

కొలంబియాకు చెందిన జూలియస్‌ టోరెస్‌ వన్యప్రాణి సంరక్షకురాలు. పంతొమ్మిదేళ్ల క్రితం ఆమె ఓ సర్కస్‌ కంపెనీని సందర్శించింది. అక్కడ మూడు నెలల వయసున్న సింహాన్ని ఆ కంపెనీ సిబ్బంది పెడుతున్న చిత్రహింసలు చూసి చలించిపోయింది. దాన్ని రక్షించి.. తాను నడుపుతున్న సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చింది. జూపిటర్‌ అని పేరు పెట్టి కన్నకొడుకులా పెంచింది. 2019లో ఆమె నడుపుతున్న కేంద్రానికి అనుమతులు లేవని జంతువులన్నింటిని వేరే జూకి తరలించారు అధికారులు. ఇది టోరెస్‌ను కలిచివేసింది. జూపిటర్‌కు కొత్త వాతావరణం నచ్చలేదు. తిండి మానేసింది. తినిపించేందుకు జూ అధికారులు చాలా ప్రయత్నాలు చేశారు. అవేమీ ఫలించలేదు.

వైరలైయిన జూపిటర్‌ పరిస్థితి..

'అప్పుడు జూపిటర్‌ బరువు 250 కిలోలు. ఇప్పుడు 90 కిలోలు. అధికారులు దాన్ని పట్టించుకోవడం లేదు' అనే టోరెస్‌ వేదనను అధికారులు పట్టించుకోకపోయినా.. స్థానిక పత్రికలు స్పందించాయి. జూపిటర్‌ దయనీయ స్థితిపై కథనాలు ప్రచురించాయి. బక్కచిక్కిన సింహం ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. టోరెస్‌కు మద్దతుగా ప్రజలు ర్యాలీలు తీశారు. చివరకు ప్రభుత్వం దిగివచ్చింది. జూపిటర్‌ను టోరెస్‌ ఉంటున్న కాలి నగరానికి ప్రత్యేక విమానంతో పంపింది. అలా కథ సుఖాంతమైంది.

ఇవీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రికి కరోనా సోకిన ఇటలీ పర్యటకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.