కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నట్లు తెరాస నేతలు గొప్పలు చెప్పుకోవడాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మండిపడ్డారు. అన్నదాతల బలవన్మరణాలకు కారణం ఎవరని రాజాసింగ్ ప్రశ్నించారు. పేద రైతు నరసింహులు, అధికారులు ఇబ్బందుల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు.
ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి...
రైతు ఆత్మహత్యకు కారణమైన అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులతో ఓట్లు వేయించుకుని వారి దయాదాక్షిణ్యాలపై ముఖ్యమంత్రైన కేసీఆర్ సిగ్గుపడాలన్నారు. రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తామన్న భాజపా నేతలను గృహనిర్భందం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపాను చూస్తే సీఎం కేసీఆర్కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి : 'ఒళ్లు దగ్గర పెట్టుకోండి'... రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరికలు