ETV Bharat / state

సంజయ్​కు తెలంగాణపై అవగాహనే లేదు: కర్నె - బండి సంజయ్​పై తెరాస విప్​ ఆగ్రహం

ముఖ్యమంత్రి కేసీఆర్​పై భాజపా వ్యాఖ్యలను ప్రభుత్వ విప్​ కర్నె ప్రభాకర్​ ఖండించారు. రాష్ట్రంపై కనీస అవగాహన లేని నేతలను భాజపా అధ్యక్షునిగా నియమించడం దురదృష్టకరమన్నారు.

whip karne prabhakar fires on bjp leaders
'సంజయ్​ను అధ్యక్షునిగా నియమించడం దురదృష్టకరం'
author img

By

Published : Mar 16, 2020, 3:18 PM IST

'సంజయ్​ను అధ్యక్షునిగా నియమించడం దురదృష్టకరం'

సీఎం కేసీఆర్​పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్​ కుమార్, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ప్రభుత్వ విప్​ కర్నె ప్రభాకర్​ తెలిపారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ప్రయత్నించాల్సింది పోయి.. లక్ష్మణ్​కు.. తన పదవీకాలమంతా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని దూషించడానికే సరిపోయిందని కర్నె విమర్శించారు.

ఇప్పుడు నూాతన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్​ కూడా లక్ష్మణ్ దారిలోనే ప్రయాణిస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతలు తీసుకున్న తొలిరోజే... రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడకుండా.. తెరాస ప్రభుత్వంపై విమర్శలు చేశారని కర్నె ధ్వజమెత్తారు. రాష్ట్రంపై కనీస అవగాహన లేని బండి సంజయ్​ను భాజపా రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం దురదృష్టకరమని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.